Reading Time: < 1 minute

Indian Woman

గృహిణీ నీకు వందనం!
బళ్ళు మూతపడ్డాయి!
ఆఫీసులు మూతపడ్డాయి!
షాపింగ్ మాల్స్ మూతపడ్డాయి!
సభలు సమావేశాలు మూగబోయినాయి!
విమానాలు చతికిల పడ్డాయి
రైళ్లు పట్టాలెక్కటంలేదు!
బస్సులు మొహం చాటేశాయి!
దేశాల సరిహద్దులు మూతపడ్డాయి!
ప్రపంచ ఆర్థిక పరిస్థితి కుదేలైంది!
షేక్ హ్యాండ్ సరే సరి,
మనుషులం ఒకళ్ళనొకళ్ళం చూసుకోవడానికే భయపడి అల్లాడుతున్నాం!
కానీ నీ దినచర్యలో ఏ మార్పులేని ఓ గృహిణీ నీకువందనం!
ఏ మార్పు లేని అదే హడావిడిలో వున్న ఓ తల్లీ నీకు వందనం!
మానవాళి ప్రత్యక్ష దైవమా!
ఓ వనితా! నీకు వందనం!