Site icon Chandamama

కోతుల సహజ మరణాన్ని మీరెప్పుడైనా చూసారా?

Reading Time: < 1 minute

కోతుల సహజ మరణాన్ని మీరెప్పుడైనా చూసారా…

వాటికి..

వారం ముందే మరణం ..
అని తెలిసిపోతుంది.

అలా తెలుసుకున్నాక అవి ఎవరి కంటా పడకుండా… సంచారంలేని చోట…

ఏ ఆహారము తీసుకోకుండా

తనకు కావాల్సినంత గుంతను తీసి.. అందులో పడుకుని ఉండిపోతాయి.

అవి చనిపోయాక భూమి తనంతట అదే మట్టితో కప్పేస్తుంది.

ఒక వారం ఒకే చోటు కదలకుండా ఉండిపోతాయి

ఆంజనేయుడు శ్రీరాముడి వద్ద అడిగి పొందిన వరం .. ఇది

మరణం ముందుగా గ్రహించి

ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా

పుట్టలోని జీవాలకు ఆహారంగా మారాలి …
నా దేహం ఎవరి కంట పడనీయక …అని వరం అడిగాడట ఆ హనుమయ్య

అందుకే ఒక్క కోతి ప్రమాదంలో చనిపోతే..

మిగతా అన్ని కోతులు కలిసి

పుట్ట మన్ను ఉన్న చోటుకు తీసుకెళ్లి ఆ దేహం మట్టితో పూర్తిగా కప్పబడేవరకు వదిలి రావు.

అందుకే కోతులకు వాటికి ఇష్టమైన అరటిపళ్ళు అంది ఇవ్వాలని చెప్తున్నారు .

అలాగే మీరు రామాయణం చదువుతున్నా లేక ఎక్కడైనా రామాయణ పారాయణం జరుగుతుంటే అక్కడ కోతులు ప్రత్యక్షమౌతాయి.

అందుకేనేమో హనుమను మించిన భక్తుడు లేడు అంటారు.

Exit mobile version