ఈరోజు కాలేజీ నుండి ఇంటికి వస్తుంటే దారిలో ఒక పది , పదిహేను మంది కమ్మ్యూనిస్టు అభిమానులు ” ట్రంప్ గో బ్యాక్ ” అని నినాదాలు ఇస్తూ కనిపించారు.
వాళ్ళ నాయకుడు సీతారం యేచూరి , ఆయన పార్టీ CPM మరికొన్ని కమ్మ్యూనిస్టు సంస్థలు , ఈ రోజూ దిల్లీ లోని జంతర్ మంతర్ దగ్గర ” అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ” ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సంధర్భంగా నాకు గుర్తుకొచ్చిన కొన్ని విషయాలు వ్రాస్తున్నాను. సీతారాం యేచూరి గారి కి ఇద్దరు సంతానం . అమ్మాయి UK [ అంటే ఇంగ్లాండు లో భాగంగా వుండిన స్కాట్ లాండ్ ] లో St. Edinburgh University లో టీచర్ గా పని చేస్తున్నది , కొడుకు అమెరికా లో ఒక ప్రముఖ Multinational company లో ఉద్యోగం చేస్తున్నాడు.
అటు అమెరికా , ఇటు ఇంగ్లాండు .. రెండూ కమ్మ్యూనిస్టులు తీవ్రంగా వ్యతిరేకించే క్యాపిటల్లిస్టు దేశాలే. మరి వారి పిల్లలు మాత్రం ఆ క్యాపిటలిస్టు దేశాలో ఉద్యోగాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. అమెరికా , ఇంగ్లాండు లాంటి కమ్మ్యూనిస్టు -వ్యతిరేక దేశాలిచ్చే డబ్బులు తమ కుటుంబాలకు కావాలి , కానీ ఇండియా లో వీధులోకొచ్చి అమెరికా డౌన్ డౌన్ అంటారు.
ఇదో విడ్డూరం కాదా ? క్యాపిటలిస్టుదేశాలను మీరు అంతగా వ్యతిరేకిస్తుంటే అక్కడికిమీ పిల్లలను ఎందుకు పంపారు ? ఏ చైనా కో , రష్యాకో , ఉత్తర కొరియా కో పంపలేకపోయారా ? ఏం , అక్కడ అవకాశాల్లేవా ? లేక ఆదేశాల్లో మీరు సంతోషంగా , స్వేచ్చగా , నిర్భయంగా వుండలేమనీ మీక్కూడా తెలిసిపోయిందా ?
తెలుగు లో శ్రీ శ్రీ గారు ఒక గొప్ప కవి. ఆయన కొడుకుల్లో ఒకాయన పేరు శ్రీరంగం వెంకట్. అతను అమెరికా లో వున్నపుడు , తన తండ్రిని ఒక సారి అమెరికా తీసుకెళ్ళి అక్కడి ప్రదేశాలు , పరిస్థితులను చూపాడు.
” నాన్న గారూ , చూడండి క్యాపిటలిష్టు అమెరికా ఎంత గొప్ప అభివృద్ధి ని సాధించింది ! మీరు చెప్పే స్వేచ్చ , సమానత్వం , కూలీలనేవాళ్ళు లేని సమసమాజం ఇక్కడ కనిపిస్తున్నది కదా , ఇకనైనా మీ కాలంచెల్లిపోయిన కమ్మ్యూనిష్టు సిద్ధాంతాలను వదిలేయలేరా ? ఇంత ప్రగతి , స్వేచ్చ కమ్మ్యూనిష్టు దేశాల్లో ఎక్కడ ? ” అని అంటే
అందుకు శ్రీ శ్రీ గారు ” ఇన్నేళ్ళపాటు తెలిసో తెలియకో ఈ కళ్ళద్దాలనే వాడుతున్నాను , ఇక ఈ వయసులో మార్చుకొని సాధించేది ఏముందిలే , ఇలానే గడచిపోనీ ” అని నిర్వేదంగా అన్నారని ఒక చోట చదివినట్టు నాకు గుర్తు.
తమ పిల్లలు సంపన్న దేశాల్లో వుండాలి , భారత్ లో పేదలు మాత్రం పేదలుగానే మిగలాలి. చెప్పేదొకటి , చేసేదొకటి . విలువల కోసం ఎన్నడూ రాజీ పడని పుచ్చలపల్లి సుందరయ్య , శంకరన్ , తరిమెల నాగిరెడ్డి , శ్రీపాద డాంగే లాంటి నిజమైన కమ్మ్యూనిస్టులతోనే ఇండియా లో కమ్మ్యూనిజం మరణించింది.
అందుకే ఇపుడు భారత్ లో కమ్మ్యూనిస్టులు తమ ఉనికినే కోల్పోతున్నారు.
మొన్న దిల్లీ అసెంబ్లీ కి జరిగిన ఎన్నికల్లో AAP కు 53.57 % , BJP కి 38.51 % ఓట్లు వస్తే , CPI కి 0.02 % , CPM కు 001 % ఓట్లు పడ్డాయి.